
ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను శనివారం పోలీసులు ఎఎంవిఐ, నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సంపత్ చర్చి వెనకాల ఉన్న 44వ జాతీయ రహదారి, జంగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న సాయిబాబా టెంపుల్ వద్ద, పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న పెట్రోల్ పంపు సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు ప్రమాద సూచికలు, రైలింగ్ రాడ్లు, వైట్ బ్రేకర్స్, ఇండికేటర్లను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఎ ఎం వి ఐ సామ్ రీఛార్డ్ సన్, ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు పవన్, సాయి కృష్ణారెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.