సర్కిల్‌.. సరికొత్త థ్రిల్లర్‌

దర్శకుడు నీలకంఠ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘సర్కిల్‌’. ఈ చిత్రంలో సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై కీలక పాత్రల్లో నటించారు.
ఆరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌.వి శరత్‌ చంద్ర, టి సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒక ఫొటోగ్రాఫర్‌ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో హీరో ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందు తుందని చిత్రబందం నమ్మకంగా చెబుతున్నారు.