ఆషా వర్కర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని,తమ బాధలను రాష్ట్ర స్థాయి అధికారులు కు విన్నవించు కోవడానికి శాంతియుతంగా వెళ్తుంటే పోలీసులు వారి ఇళ్ళను చుట్టుముట్టి అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విచారం వ్యక్తం చేసారు.ప్రజా సంఘాల నాయకులు, మేదావులు ప్రభుత్వ దుందుడుకు విధానాలను ఖండించాలని ఆయన కోరారు. సోమవారం అశ్వారావుపేట,అన్నపురెడ్డిపల్లి,ములకలపల్లి మండలాల్లో ఆశా వర్కర్స్ ను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆని,ఆశా సమస్యలను పరిష్కరించాలని పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ నుండి మెడికల్ & హెల్త్ కమీషనర్ వరకు,స్థానిక ఎమ్మెల్యే ల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, అసెంబ్లీలో మా సమస్యలు ప్రస్థావన రాలేదు.అందుకు కమీషనర్ ఆఫీసుకు వెళుతున్నారు.సమస్యలు పరిష్కరించకుండా హక్కులు అడిగితే అరెస్టు చేయడం ఏ ప్రజాస్వామ్యం,గత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం చేస్తే గ్రామాలలో ఉండే ఆశా లు స్థానిక( పంచాయతి )ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారు గమనించాలి అని అన్నారు.