
కేరళ వరద బాధితులకు శనివారం చందూర్ మండల కేంద్రం లో సీఐటీయూ ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ చేపట్టిన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరాళాలు సేకరణ చేస్తున్నామని కార్మిక నేత నన్నెసాబ్ అన్నారు. ప్రకృతి విలయ తాండవంలో వరదల్లో వందల మంది చిక్కుకొని కేరళ ప్రజలు మరణించటం బాధాకరం అన్నారు.వరదలలో మృతి చెందిన కుటుంబాలను మానవత్వం తో విరాళాలు అందించి మానవత్వం చూపాలని కోరిన్నారు.రాజకీయలకతీతంగా, ప్రజా, యువజన, మహిళా సంఘాలు,సామాజిక, విద్యార్థి సంఘాలు విరాళాలు అందించాలని కోరిన్నారు. ఈ కార్యక్రమం లో సాయిబాబా,భూమయ్య,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.