పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించండి: సీఐటీయూ

నవతెలంగాణ – తుంగతుర్తి
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికులంతా ఒక్కటై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో సీఐటీయూ సమావేశంలో పాల్గొని మాట్లాడారు .ఈ మేరకు ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతన సవరణ జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రములో బీజేపీ అధికారంలోకి రాక ముందు,మేకిన్ ఇండియా,భేటీ బచ్చావో,నల్లడబ్బు వెలికి తీసి ప్రతీ పేదల ఖాతాలో 15లక్షల రూపాయలు జమ చేస్తాననీ,వీదేశి వస్తువుల బహిష్కరణ,అవినీతి అంతం చేస్తాననీ బూటకపు వాగ్దానం చేసి అధికారములోకి వచ్చిన మోది సర్కార్ అట్టి వాగ్దానాలను తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజల మధ్యన మత ప్రాతిపదికన చీల్చి మత ఘర్షణలను పెంచేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.రాజ్యాంగబద్ధంగా అధికారములోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వసం చేసీ పురాతన మనుధర్మ చట్టాలను తెచ్చేందుకు సన్నాహాలు మోదీ చేస్తున్నారని విమర్శించారు.మోడీ ప్రధానమంత్రి అయ్యాకా 20 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 20కోట్ల మంధి సంగటీత హమాలీ వర్కర్స్ మోదీ వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయారని విమర్శించారు. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పది సంవత్సరాల క్రితం నుండీ షెడ్యూల్ పరిశ్రమలలలో పని చేస్తున్న లక్షల మంది కార్మికులను చాలీ చాలని వేతనాలు చెల్లిస్తుండడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయాని అన్నారు. వారికి ఐదు ఏండ్ల కోక సారి వేతన సవరణ జీవోను విడుదల చేయక పోవడం వల్ల కోట్లాది రూపాయల వరకు ఈ పదేళ్లలో కార్మికులు నష్ట పోయారని వాపోయారు. దేశంలో ఎగుమతి దిగుమతి చేసే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలనీ ఏప్రిల్ మొదటి వారంలో హమాలి సంక్షేమ బోర్డు సాధన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికోసం 23మండలాలు, ఐదు మున్సిపల్ పట్టణాలు సంక్షేమ బోర్డు సాధన జాత తిరుగుతూ 50వేల మంది హమాలీ లను ప్రత్యక్షంగా కలవడం జరుగుతుందని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాల తో పాటు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని నెమ్మాది కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు శ్రామిక మహిళా కన్వీనర్ చెరుకు యాక లక్ష్మీ,వజ్జే సైధయ్య, అవిలయ్య, బాబు, సింగిల్ రావు,యాదగిరి,వెంకటేశ్వర్లు, వెంకన్న, జానికి రాములు తదితరులు పాల్గోన్నారు.