డీసీఎల్ కి సమ్మె నోటీస్ అందజేసిన సీఐటీయూ జిల్లా కమిటీ

నవతెలంగాణ – కంటేశ్వర్
ఫిబ్రవరి 16, 2024న జరిగే జాతీయ సమ్మెలో భాగంగా తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ ఫెడరేషన యూనియన్,(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డీసీఎల్ కి సమ్మె నోటీసు బుధవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్, తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక చట్టాల సవరణలు ఆపాలని, ప్రైవేటీకరణను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, వయసు పైబడిన వారికి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వారి పిల్లల చదువుల కొరకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. నిర్మాణ కార్మికుడు ప్రమాదంలో చనిపోతే ఇచ్చేటువంటి సహాయాన్ని ఆరు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని, అలాగే సహజ మరణానికి లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచాలని మరియు దహన సంస్కారాలకి. వివాహానికి. ప్రసూతికి ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుండి లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరడం జరిగింది. ఇసుక ఇటుక సిమెంటు ఇనుము ధరల పెరుగుదలను నియంత్రించాలని ఖాళీగా ఉన్నటువంటి ఏ సి ఎల్, డీసీఎల్, ఏ ఎల్ ఓ,  జూనియర్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డు కమిటీని కార్మిక సంఘాల నాయకులతో ఏర్పాటు చేయాలని అన్నారు. భవననిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను వెంటనే ఇవ్వాలని అన్నారు. ఫిబ్రవరి 16న జరిగే జాతీయ సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర  ప్రభుత్వంపై నిరసన తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు దేవాంగుల కృష్ణ, మరియు నలవాల నరసన్న కార్మికులు  భాస్కర్,సాయిలు  గఫూర్ మారుతి శ్యామ్ రాజయ్య అమీర్ రాజు మనోహర్ రవి తదితరులు పాల్గొన్నారు.