క్యాంపస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్

నవతెలంగాణ – భిక్కనూర్
క్యాంపస్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బి టి ఎస్ వద్ద ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్ లో ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులు చేస్తున్న సమ్మెలో సిఐటియు జిల్లా కన్వీనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఈ ఎస్ ఐ, పి ఎఫ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా కల్పించాలని తెలిపారు. యూనివర్సిటీలపై చిన్న చూపు తగదని వేతన సవరణ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, సిఐటియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.