ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో భవన నిర్మాణ కార్మికుల యూనియన్ కార్యాలయంలో గురువారం యూనియన్ అధ్యక్షులు చిగుళ్ల రమేష్ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ హాజరై మాట్లాడుతూ సీఐటీయూ విశిష్టత మరియు కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న యూనియన్ సీఐటీయూ అని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మికులను ఏకం చేసి ఐక్య పోరాటాలు నడుపుతున్న ఏకైక సంఘం సీఐటీయూ అని ఆదిమూలం నందీశ్వర్ చెప్పారు. భవన కార్మికుల సంక్షేమ బోర్డులో నిధులను పాలకవర్గాలు పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అట్లాగే ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చీమకుల శ్రీరాములు,బక్క బొందయ్య, కిష్టయ్య,సాయిలు,బిక్షపతి,సాయి తదితరులు పాల్గొన్నారు.