సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
విపత్కర పరిస్థితిలో కూడా ప్రజలకు తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ వారు గ్రామ ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేస్తూ అవసరమైతే వారి వంతు సహాయ సహకారాలు అందిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండ్ల అప్పిరెడ్డి మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ సిఐటియు మండల కమిటీ సమావేశాన్ని బల్లం ఎల్లయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 సంవత్సరాలు గా గ్రామ ప్రజలకు అనేక సేవలందిస్తున్నారు అనేక ప్రభుత్వాలు మారిన పంచాయతీ సిబ్బంది బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చెందారు. కరోనా వంటి విపత్కరపరిస్థితుల్లో తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రజలకు పారిశుద్ధ్యం బ్లీచింగ్ పౌడర్ మంచినీటి సరఫరా మందుల పంపిణీ భోజనాల పంపిణీ చేసినారని అన్నారు. కరోనా సమయంలో తమ కుటుంబాల సభ్యులు దగ్గరికి రాకుండా చనిపోయిన శవాలను సైతం దహన క్రియలలో పాల్గొన్నారు అని తెలిపారు. గతంలో సమ్మెలో ఉన్నప్పటికీ భద్రాచలం వద్ద వరద ఉధృతిలో అనేక గ్రామాలు ముంపు గురైనప్పుడు సమ్మెను మినహాయించి సేవలు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. ఈ మధ్య ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో వరద ఉధృతి కారణంగా అనేక కుటుంబాలు నీళ్లలో దిగ్బంధమైతే గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలందరికీ సేవ చేసి ఆదుకోవడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల పంచాయతీ సిబ్బంది మెడకు ఉరితాడులా ఉందని, ఉద్యోగ భద్రత లేదని పని గంటలు లేవని కట్టు బానిసల్ల నిజాం కాలం నాటి పరిస్థితిని తీసుకొచ్చిందని, దానివలన ఏ శాఖలో లేనటువంటి అందరూ కలిసి అన్ని పనులు చేయాలనే నిబంధన వలన నైపుణ్యం లేని పనులు చేస్తూ అనేక జిల్లాల్లో ట్రాక్టర్ మరణాలు కరెంటు స్తంభాలపై మరణాలు జరిగాయని పంచాయతీ కార్మికులకి సమయానికి వేతనాలందక ఖమ్మం భద్రాచలం జిల్లాలలోఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అన్నారు.
అయినా ఈ ప్రభుత్వాలు ప్రతినెల వేతనాలు చెల్లించకపోవడం చాలా దారుణం అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడితే మీ అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అందుకు అనుగుణంగా దాదాపు పంచాయతీ కార్యదర్శుల నుండి పంచాయతీ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి కి అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేని పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్న పంచాయతీ సిబ్బందికి రాష్ట్రవ్యాప్తంగా 05 నుండి 08 నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయని ఇట్టి పెండింగ్ వేతనాలపై నా పంచాయతీ కార్మికుల సమస్యలపై అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించిన పెడచెవిన పెట్టడమే తప్ప పట్టించుకోవడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాల కార్యక్రమాల పేరుతో పిలుపులిచ్చి పనులు చేయిస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి జీవో నెంబర్ 51 సవరించాలి పి ఆర్ సి పరిధిలోకి గ్రామపంచాయతీ ఉద్యోగులను తీసుకోవాలి. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులందరి నీ పర్మినెంట్ చేయాలి పాత కేటగిరీల వారీగా కొనసాగించాలి కారోబార్ బిల్ కలెక్టర్ ను సహాయ కార్యదర్శి లుగా నియమించాలి. అర్హులైన ఇతర సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని 10 లక్షలకు తగ్గకుండా అమలు చేయాలి పిఎఫ్ ఈ ఎస్ఐ అమలు చేయాలి. ధహన ఖర్చులకు ఇచ్చినటువంటి ఉత్తర్వులను 20 వేలకు పెంచాలి. వయస్సు పైబడిన పేరుతో తొలగిస్తున్న సిబ్బంది స్థానంలో వారి కుటుంబాలకే అవకాశం ఇవ్వాలి మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి పై డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలలో అమలు చేయాలని లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వం పై హైదరాబాదు కేంద్రంలో 48 గంటల దీక్షలు చేపట్టి ఉద్యమాలను ఉదృతం చేస్తామని తెలిపారు .కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారబోయిన శ్రీను. మయ్య రాము ముంజంపల్లి యాకయ్య రామకోటి మహమ్మద్ సుభాన్ జల్లేవెంకటమ్మ ఆరేపల్లి రాధమ్మ భూక్య బిక్కు హెచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.