– సంఘం రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పెంటయ్య
నవతెలంగాణ-షాబాద్
కార్మికుల సంక్షేమం కోసమే సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లిదేవేందర్, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పెంటయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో నూతనంగా ఆవిష్కరించిన సీఐటీయూ జెండావిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..సీఐటీయూ అనేక పోరాటాలు నిర్వహిస్తూ, కార్మికుల హక్కులను సాధించిందని తెలిపారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా సీఐటీయూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా సీఐటీయూ ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విజయ, మాజీ ఉపసర్పంచ్ నరసింహ, సీఐటీయూ మండల నాయకులు నరసింహ, గ్రామపంచాయతీ యూనియన్ మండలాధ్యక్షుడు సత్తయ్య, మండల ఉపాధ్యక్షులు నరసింహ, లక్ష్మయ్య, తాళ్లపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.