జీపీ కార్మికులతో వెట్టి చాకిరిచేయిస్తున్న ప్రభుత్వం: సీఐటీయూ

Govt messing with GP workers: CITUనవతెలంగాణ – భువనగిరి
గ్రామపంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి కనీస వేతనం చెల్లించకుండా సకాలంలో వేతనాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అన్నారు. శనివారం భువనగిరి లో సుందరయ్య భవనంలో  సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా స్థాయి సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు బందెల బిక్షం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు సకాలంలో వేతనాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నదన్నారు. ఏళ్ల తరబడిగా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని ఎన్నికల కంటే ముందు గ్రామపంచాయతీ కార్మికులకు వారి సమస్యలు పరిష్కారం చేస్తామని వేతనాలు చెల్లిస్తామని కార్మిక చట్టాల అమలు చేస్తామని సమ్మెల సందర్భంగా అనేక మాటలు మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు హైదరాబాదులో ఉన్న రాష్ట్ర కమిటీని కలిసిన నిర్లక్ష్యంగా ఉన్నదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయన్నారు. వెంటనే కార్మికులకు బకాయిగా ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వయసు పెరిగిందని పేరుతో కార్మికులను తొలగించే విధానాన్ని విరమించుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ నాయకులు మంద యాదగిరి, మండల శీను, బాలరాజు సిద్దంకి యాదగిరి, బాబు, బుజ్జమ్మ, మణెమ్మ, ప్రమీల లక్ష్మి  పాల్గొన్నారు.