అంగన్వాడీ లకు రూ.26 వేలు వేతనం చెల్లించాలి: సిఐటియు నాయకులు అర్జున్

– సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు – నాయకులు చిరంజీవి 
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడీ లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్డ్యూటీ చట్టం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు సిఐటియు ఆద్వర్యంలో సోమవారం స్థానిక మూడు రోడ్ల కూడలి లో టెంట్ వేసి నిరవధిక సమ్మె కు దిగారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఏర్పడిన నాటి నుండి పేదలు పిల్లలు,మహిళలకు పౌష్టికాహారం,ఆరోగ్యపరమైన సేవలందిస్తున్నా వీరి కనీస వేతనం గాని,సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన వీరి సమస్యలు పట్టించుకోలేదన్నారు.మినీ అంగన్వాడీ లను ఎటువంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా గుర్తించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని అంగన్వాడి సెంటర్ లో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) నాయకులు చిరంజీవి మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులు హక్కులు రక్షణ కోసం సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని బరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రాధ, రాజేశ్వరి,ఉష,వాణి,విజయ, లక్ష్మి, కృష్ణవేణి, ప్రవీణ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.