నవతెలంగాణ – నవీపేట్: గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్( సిఐటియు) మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులుకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, నాయక్ వాడి శ్రీనివాస్ మరియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ శనివారం ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. మేకల ఆంజనేయులు పెద్ద కుమారుడు రాజు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆయనను పరామర్శించి సిఐటియు కార్మిక సంఘం ద్వారా అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అంతకుముందు వడదెబ్బతో మృతి చెందిన ర్యాగళ్ల లావణ్య భర్త రాజశేఖర్ ను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం విషయంలో జిల్లా అధికారులతో సంప్రదించి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించడం సరికాదని ఇప్పటికైనా సౌకర్యాలను కల్పించాలని కోరారు.