చండూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నాలుగు నెలల జీతాలు, 12 నెలలుగా పిఎఫ్ విత్తనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ.. తమకు నాలుగు నెలలుగా వేతనాలు లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నావని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. అప్పులు చేసి, పస్తులు నుండి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. అధికారులు స్పందించి వెంటనే తమ జీతాలు ఎకౌంట్లో వెయ్యాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు అన్నెపర్తి చిన్న వెంకన్న, కార్యదర్శి కత్తుల సైదులు, ఉపాధ్యక్షుడు నల్లగంటి లింగస్వామి, కోశాధికారి లఫంగి నాగరాజు, కలమ్మ, చంద్రమ్మ, అలివేలు, రవణమ్మ, యాదయ్య, రమేష్, ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.