కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఐటీయూ కీలక పాత్ర

కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఐటీయూ కీలక పాత్ర– కాటేదాన్‌ క్లస్టర్‌ కన్వీనర్‌ కన్వీనర్‌ రుద్రకుమార్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
దశాబ్ద కాలంగా కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని కార్మి కుల సమస్యలను పరిష్కరించడంలో సీఐ టీయూ కీలక పాత్ర పోషిస్తుందని కాటేదాన్‌ క్లస్టర్‌ కన్వీనర్‌ రుద్రకు మార్‌ స్పష్టం చేశారు. కాటేదాన్‌ పారి శ్రామిక ప్రాంతంలోని ఒక బిస్కెట్‌ కంపెనీలో పనిచేస్తున్న సతీష్‌ అనే కార్మికుడు తన కుటుంబ పరిస్థితుల కారణంగా కంపెనీకి వెళ్లడం లేదు. అయితే తనకు రావలసిన గ్రాడివిటీ ఇతర డబ్బుల ను ఇవ్వాలని కంపెనీ యాజమాన్యానికి అడిగిన స్పందిం చకపోవడంతో కాటేదాన్‌ క్లస్టర్‌ కన్వీనర్‌ రుద్రకుమార్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లారు. వెంటనే స్పందిం చిన రుద్రకుమార్‌ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరి పి ఆ కార్మికులకు రావలసిన గ్రాడివిటీ ఇప్పించారు. ఈ సందర్భంగా రుద్రకుమార్‌ మాట్లాడుతూ..కాటేదాన్‌ పారి శ్రామిక ప్రాంతాల్లోని చాలా కంపెనీల్లో యజమానులు కార్మి కుల చేత వెట్టి చాకిరి చేయించు కొని కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇతర రా ష్ట్రాల నుంచి వచ్చిన కార్మికు లు ఎక్కువగా ఉంటారు వారి అవస రాలను ఆసరాగా తీసు కొని కం పెనీ యాజమాన్యాలు తక్కువ వేతనాలకి పని చేయించుకుంటు న్నారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారికి సరైన నష్ట పరిహారం ఇవ్వ కుండా కార్మికులను కంపెనీ నుంచి వెళ్ల గొడుతున్నారని తెలిపారు. ఇలాంటి కార్మికుల కోసం సీఐ టీయూ ఎల్లప్పు డు అండగా ఉంటుందని కార్మికులకు ఏ సమసున్నా తమ దృష్టికి తీసుకొని వస్తే తక్షణం సమస్య ల పరిష్కారానికి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.