నవతెలంగాణ – ములుగు
కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడేది సీఐటీయూ అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటీయూ కార్యాలయం ముందు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ సిఐటియూ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసే సంఘం సీఐటీయూ అన్నారు. ఎనిమిది గంటల పని దినాల కోసం విరోచితమైన పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి హక్కులను సాధించుకున్నారని అన్నారు. కనీసవేతనాలు అమలు చేయాలని అనేక ఉద్యమాలు సీఐటీయూ చేపట్టిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాల అధికార కాలంలో సరళీకత ఆర్థిక విధానాలు ముందుకు తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాసే విధంగా కుట్ర పన్నుతోందన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మిక ఐక్యతను పక్కదారి పట్టిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అభివద్ధి కుంటుపడిందన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా హక్కులను కాపాడు కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్, ఆర్ నీలాదేవి, డీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, బ్రహ్మచారి, జన్ను సాంబయ్య,సామర్ల రాజు సునీల్, తదితరులు పాల్గొన్నారు.