కాటేదాన్‌లో సీఐటీయూ సీనియర్‌ నాయకులు ఎన్‌వి భాస్కరరావు వర్థంతి

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
సీఐటీయూ సీనియర్‌ నాయకులు ఎన్‌వి భాస్కరరావు వర్థంతిని కాటేదా న్‌లోని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో సీఐ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సమస్యల మీద రాజులేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి భాస్కర్‌ రావు అని అన్నారు. నిరంతరం కార్మికుల మధ్య లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై కృషి చేశాడని కొనియాడారు. సీఐటీయూ ఏర్పడ్డ 1970 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో ప్రథమ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఉన్న ఈసీఐఎల్‌, బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల లో కార్మికులను చైతన్యం పరిచే అక్కడ యూని యన్లు స్థాపించడం కోసం ప్రధా నంగా కృషి చేసినట్టు తెలిపారు. ప్రధానంగా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో కాటేదాన్‌ క్లస్టర్‌ పారిశ్రామిక ప్రాంతం 1978 సంవత్సరంలో గగన్‌పాడ్‌ మెడిసిన్‌ కు సంబంధించిన పరిశ్రమలో మొదటి సీఐటీయూ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చం ద్రమోహన్‌, జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకు మార్‌, రాజేంద్రనగర్‌ మండల కాటేదాన్‌ క్లస్టర్‌, కమిటీ సీఐటీయూ నాయకులు స్వామి, శ్రీను, భాస్కర్‌, ప్రవీణ్‌, సచిన్‌, చాంద్‌ పాషా, విక్రమ్‌, నరసింహారెడ్డి, సువార్త, హైమావతి ప్రేమాజీ, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.