ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన స్కీం వర్కర్లు సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, సౌకర్యంతో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో వంటగది నిర్మించి, వంట పాత్రలు ప్రభుత్వమే సరఫరా చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సీఐటీయూ కమిటీ సభ్యులు సురేష్ గొండ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సరస్వతి, సీఐటీయూ నాయకులు అజయ్ కుమార్, కార్మికులు సావిత్రి, సుమన్ భాయ్, మండలంలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు పాల్గొన్నారు.
.