నవతెలంగాణ – భూదాన్ పోచంపల్లి
ఆర్పి లకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మంచాల మధు డిమాండ్ చేశారు. గురువారం రోజున ఆర్పి సమావేశం రామసాని వసంత అధ్యక్షుడు నిర్వహించారు. సమావేశానికి మంచాల మధు హాజరై మాట్లాడుతూ.. ఆర్పీలతో అనేక పనులు చేయించుకుంటూ కనీసం ఆరు నెలల నుండి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్పీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని వారి డిమాండ్ చేశారు. అదేవిధంగా కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్పీలకు తక్కువ వేతనం ఇస్తున్నారని, నేడు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో వచ్చే వేతనం సరిపోని స్థితిలో ఉన్నారన్నారు. అప్పుచేసి కుటుంబాన్ని పోషించవలసి వస్తుందని, అనేక ఇబ్బందులు ఉన్నా తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆర్పీలను గుర్తించి కనీస వేతనం అమలు చేసి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆదివారం పండుగ సెలవులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆర్పీలకు సమయం అనేది లేకుండా 24 గంటలలో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వారితో పని చేయించుకుంటున్నారని అన్నారు. వీరికి పని సమయం అనేది నిర్ణయించకుండా ఏ సమయంలో ఫోన్ చేసి ఏ పని చెప్తారు తెలియని పరిస్థితిలో ఆర్పీలు ఉన్నారని తెలిపారు. వీరికి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని అన్నారు. కనీస వేతనం అమలు చేసి ఐడి కార్డులను ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్పీలుగా ఉన్న వీరిని మున్సిపల్ కేంద్రంలో అనేక కార్యక్రమాలలో వీరి సేవలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వీరికి మాత్రం ప్రాణ రక్షణ లేకుండా కనీసం ఉద్యోగ భద్రత లేకుండా, కుటుంబాలను పక్కనపెట్టి మరీ కరోనా సమయంలో పనిచేసిన ఆర్పికులకు కనీస వేతలం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి కనీస వేతనంతో పాటు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా, సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వ సెలవులను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మ, అనురాధ, పద్మజ, చంద్రిక, చంద్రకళ, సుజాత, సురేఖ, సంతోష, రమ్య తదితరులు పాల్గొన్నారు.