నవతెలంగాణ – తాడ్వాయి
స్కీమ్ వర్కర్లకు ఆశ, అంగన్వాడీ లకు 14,15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం కనీస వేతనం రూ.26వేల రూపాయలు అమలు చేయాలని ములుగు జిల్లా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సమ్మక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆశ, అంగన్వాడి, తాపీ మేస్త్రి ఇలా సంఘం నాయకులు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విధానాలు వేగంగా అమలు జరుపుతుందని, ఇప్పటికే 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లను రూపొందించిందని అన్నారు. అంగన్వాడీ ల పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే రెండు లక్షలు కు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రేట్యూటీ సౌకర్యం కల్పించాలని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక, ప్రైవేటీకరణ, విధానాలు విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ లు సరోజన, రేణుక, సరిత, జమున రాణి, మంజుల, రమాదేవి, ఆశాలు సుధా, భాగ్యలక్ష్మి, రజిత, నాగమణి, కవిత, తాపీ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.