నవతెలంగాణ – జుక్కల్
ఆశ వర్కర్ల 15రోజుల సమ్మె సందర్బంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిపెస్టో లో పొందు పర్చిన హామీలను తక్షణమే అమలు చెయ్యాలని కోరుతు గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం లొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సీఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమన్ని చేపట్టారు. ఈ సందర్బంగా నియోజకవర్గం లొని 8మండలాలకు చెందిన ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆశ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ మాట్లాడుతూ.. ఆశ లకు కనీస వేతనం సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు రూ.26 వేలు పిక్స్ చెల్లించాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత, ఈ ఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశలకు నష్టం కల్గించే పరీక్షలు పెట్టె నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసం హరించుకోవాలని గతంలో ఇచ్చినట్లుగా ప్రతి నేల 2వ తేదిన పరితోషికలు చెల్లించాలని 2021జులై నుండి డిసెంబర్ వరకు 6నెలలపి ఆర్ సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆశలకు రూ.50లక్షల ఇన్సూరెన్స్,మట్టి ఖర్చులు రూ.50వేలు చెల్లించేల వెంటనే సర్క్యులర్ జరిచేయ్యాలన్నారు. ఆశలకు పనిబారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు చెల్లించి ఇప్పుడిస్తున్న పారితోషి కల్లో సగం పెన్షన్ చెల్లించాలని 24న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆశలను ఆడుకోవాలని కోరుతూ తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం ను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జుక్కల్ తాసిల్దార్ కు అందజేశారు. కార్యక్రమం లొ ఈ కార్యక్రమంలో నాగమణి,లలిత, విజయ,సుమ,గంగామణి తదితరులు పాల్గొన్నారు.