
గురువారం వేములవాడ సీఐటీయూ డివిజన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా నేడుజరగబోయే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వేములవాడ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని తిప్పాపురం బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సీఐటీయూ నాయకులు తెలిపారు. వేములవాడ డివిజన్లో కూడా మండలాలు వారిగా ఉన్న అన్ని రంగాల కార్మికులు, బీడీ కార్మికులు, ఉపాధి కూలీలు, రైతాంగం, విద్యార్థులు, మేధావులు, సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున ఉదయం 10 గంటల వరకు తిప్పాపురం బస్టాండ్ వచ్చి , కేంద్ర బిజెపి అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ,రాజన్న సిరిసిల్ల జిల్లా సీఐటీయూ పక్షాన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా ఐద్వాజ్ సంఘం కార్యదర్శి జవాజి విమల, జిల్లా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ముక్తికాంత అశోక్, రామంచా అశోక్, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు చిలుక బాబు తదితరులు పాల్గొన్నారు.