
నవతెలంగాణ – కంటేశ్వర్
పెండింగ్ లెప్రసి బిల్లులు ఇవ్వకుంటే సర్వే చెయ్యమని జిల్లా అడిషనల్ కలెక్టర్ కి పిర్యాదు బుధవారం చేశారు. 2021, 2022,2023 పెండింగ్ లెప్రసీ సర్వే బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఈ సంవత్సర లెప్రసి సర్వే చేపడతామనీ ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల 2021 మరియు 2022 మరియు 2023 లెప్రసి బిల్లులు మంజూరు చేయాలని అనేకమార్లు మీకు విన్నవించుకున్నాము. ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ధర్నా నిర్వహించిన సమయంలో వెంటనే మంజూరు చేస్తామని మీడియా సమక్షంలో అధికారులు తెలియజేశారు.హామీ ఇచ్చి 6నెలలు గడిచాయి.ఇప్పటికీ పెండింగ్ బిల్లులు రాలేదు. గత మూడు సంవత్సరాల నుండి అధికారులు హామీలు ఇవ్వటం మర్చిపోవడం అవుతంది ఇతర జిల్లాలలో లెప్రసి బిల్లు మంజూరు చేశారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రశ్నార్థకంగా ఉంది. లెప్రసి బిల్లులో మీద సమగ్ర విచారణ జరిపి ఆశా కార్యకర్తల పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం మళ్ళీ లెప్రసీ సర్వే చేయాలని డీఎంహెచ్ఓ నుండి ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తాం.గతంలో సర్వే ఫార్మాట్ పేపర్స్ ఇచ్చేవారు.ఇప్పుడు ఆశ వర్కర్స్ కి జిరాక్స్ తీసుకోమని చెప్పుతుంది. పెండింగ్ బిల్లులు ఇవ్వరు.స్టేషనరీ ఖర్చు అధనంగా ఉంది .ఇది సరైన విధానము కాదు. కాబట్టి మా పెండింగ్ లెప్రసి బిల్లును వెంటనే మంజూరు చేయాలి. పెండింగ్ బిల్లులు మా బ్యాంకు అకౌంట్లో చేరిన తర్వాతనే ఈ సంవత్సరము లెప్రసీ సర్వే చేపడతామని తెలియజేస్తున్నాం.వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ, రేణుక సుకన్య బాలమణి రమా సునీత, సిహెచ్ నర్సా లలిత, ఆసియా, పద్మ ,రేణుక, సరోజ , వసంత సుజాత తదితరులు పాల్గొన్నారు.