
జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్ ల పైన దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టే రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్ జెండర్లు ఉపాధి అవకాశాలు లేక బిక్షాటన చేస్తూ శుభకార్యాలలో పాల్గొని, వారు అభిమానంతో ఇచ్చే వాటిని తీసుకొని జీవిస్తున్నటువంటి వారిపైన ఇటీవల పిల్లలను హరిస్తున్నారు. అనే నెపంతో ట్రాన్స్ జెండర్ లను అనుమానిస్తూ దౌర్జన్యాలు చేస్తూ తీవ్రమైనటువంటి మానసిక శోభకు గురి చేస్తున్నారని రోజురోజుకు బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి ట్రాన్స్ జెండర్ లకు ఏర్పడిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో ఆదరించిన ప్రజలు జరుగుతున్న దుష్ప్రచారాలను అపోహలను నమ్మి ఇటీవల జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో ఒకరిని విపరీతంగా కొట్టి ప్రాణాలు తీయడం జరిగిందని, అదేవిధంగా దేగాంలో ఒకరిని బంధించి నిర్బంధించారని, ఈ విధంగా దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అరికట్టి ట్రాంజెండర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తమ సమస్యలను నినదించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ ల నాయకులు గంగ, జరీనా, అలక, రక్ష, హారతి, ప్రియా తదితరులు పాల్గొన్నారు.