
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించిన పలు దీర్ఘకాలిక కార్మిక సమస్యలు అపరిస్కృతంగానే ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షులు కార్యదర్శులు ఎస్.వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించినా పలు దీర్ఘకాలిక కార్మిక సమస్యలు అపరిస్కృతంగానే ఉన్నాయని, పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఆర్థిక సం. ముగిసి 4నెలలు గడిచినా యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నదని, వెంటనే లాభాలు కార్మికులకు తెలియజేసి 35శాతం వాటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ గుర్తింపు పత్రం తీసుకోకుండానే యాజమాన్యం నిర్వహిసున్న పలు సమావేశాలకు వెళ్తూ కార్మికుల సమస్యల పరిష్కారంలో మాత్రం గుర్తింపు పత్రం లేదని దాటవేస్తున్నారని అన్నారు. దానివలన కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నా పట్టించుకోకుండా సీఐటీయూ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించడం సరికాదని అన్నారు.కార్మికుల అలవెన్స్ లపై ఐటి మాఫీ, సొంతింటి కల, మారు పేర్లు, టెక్నీషియన్లు అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయినప్పుడు సర్ఫేస్ లో అదే డిసిగ్ నేషన్ కొనసాగింపు వంటి సమస్యలే కాకుండా రిటైర్డ్ కార్మికుల గ్రాట్యూటీ పెన్షన్లు, సేఫ్టీ పరంగా కార్మికులను ఎల్లో కార్డు, రెడ్ కార్డు అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్న విధానం సరికాదని అన్నారు. గనుల పైన నాణ్యమైన పనిముట్లతో పాటు సీఎంపిఎఫ్ ఆన్లైన్లలో అవకతవకలను సరిచేయాలని అన్నారు.అలాగే విష జ్వరాలు ప్రబలుతున్నందున కార్మిక వాడలలో ఫాగింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య,సీనియర్ నాయకులు ఆల్వల సంజీవ్, అర్గనైజర్లు జడల ప్రవీణ్, జోరుక వెంకటేష్, నాగవెల్లి శ్రీధర్,ధనిషెట్టి సురేష్, లింగాల రమేష్, అభిలాష్ పాల్గొన్నారు.