హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: సీఐటీయూ

– ప్రభుత్వ రంగ సంస్థల గోదాముల్లో పనిచేసే హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ బేవరేజెస్ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ బాడీ సమావేశం ఇందిరానగర్ గోదాంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తూ ప్రమాదాల గురై మరణించిన ఎలాంటి నష్టపరిహారం పొందలేక అనాధలుగా మారిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా 50 సంవత్సరాలు నిండిన అమాలీలకు నెలకు రూ.6000 రూపాయలు పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బేవరేజెస్, ఎఫ్ సి ఐ, సివిల్ సప్లై, మార్కెట్, ఎలక్ట్రిసిటీ స్టోర్, సిడబ్ల్యుసి, ఎస్డబ్ల్యూసి తదితర సంస్థలలో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నల్లగొండ గోదాం అధ్యక్షులు జేరిపోతుల సైదులు, కార్యదర్శి తొట్ల లింగయ్య ఉపాధ్యక్షులు  క్యాస రమేష్, కోశాధికారి తూర్పునూరి ప్రసన్నకుమార్,  మాజీ అధ్యక్షులు సల్ల యాదయ్య, మాజీ కార్యదర్శి లోడంగి ఉపేందర్, మాజీ ఉపాధ్యక్షులు అశోక్,  కమిటీ సభ్యులు పాయిలి అరుణ్, వనపర్తి సైదులు, సోము లింగస్వామి,  మేస్త్రీలు దొండ మధు, తొట్లసోములు మట్టి పెళ్లి పాండు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.