మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

నవతెలంగాణ – భీంగల్
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ రామకృష్ణకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్మికులకు రెండు సంవత్సరాలకు పైగా చెల్లించవలసిన పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులను జమ చేయకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల వేతనం చెల్లించటం లేదని. కార్మికులకు ఆదివారం సెలవు అమలు జరపడం లేదని అదేవిధంగా కార్మికులకు చీపుర్లు, పారలు, గ్లౌజులు, చెప్పులు ఇవ్వటం లేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు కార్మికులు ఆదివారం సెలవు సెలవును అమలుజర్పటంతో పాటు బకాయిలను చెల్లించాలని లేనియెడల ఆందోళన చేయాల్సి వస్తుందని రమేష్ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక నాయకులు గంగవ్వ, బాబాయ్, సాయిలు, శ్యామ్, కలవ తదితరులు పాల్గొన్నారు.