ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆటో వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓ కి వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కటారి రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మూలంగా నష్టపోతున్న కార్మికులకు జీవన భృతి నెలకు 4500 కల్పించాలని అదేవిధంగా మూడు నెలల ఈ ఎం ఐ మారిటోరియం ప్రకటించాలని ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం తరహాలో కమిషన్ లేకుండా రుణ ఏర్పాట్లు చేయాలని యాప్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నరసయ్య ఆటో యూనియన్ నాయకులు కృష్ణ, జావిద్, అంజయ్య తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్మికుల పాల్గొన్నారు.