16న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
బీజేపీ ప్రభుత్వ కార్పోరేట్ ,మతతత్వ ,కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు,రైతులు,కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్  జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీపర్స్ జిల్లా సమస్యలపైన కలెక్టరేట్ ఏ ఓ జగన్  కి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుంది తప్ప పేదలు, కార్మికులు రైతుల కోసం కాదని విమర్శించారు. డిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న పోరాటం దేశం మొత్తం చూస్తున్నదని రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని మోడీ ప్రభుత్వం తెచ్చిన  లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ,కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలపై ఫిబ్రవరి 16 న దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ,సంయుక్త కిసాన్ మోర్చా , రైతు సంఘాల అధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త నిరసన కార్యక్రమాలలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ కార్యాలయాల స్విపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కౌసల్య,,శంకరమ్మ, జిల్లా కోశాధికారి తేజ,జిల్లా నాయకులు మల్లేష్ లు పాల్గొన్నారు.