
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను రాజకీయాల కతీతంగా జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు పిలుపునిచ్చారు. హాలియాలో స్థానిక సుందరయ్య భవన్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అక్రమ దానాన్ని వెలికి తీసి ఇంటికో రూ.15 లక్షలు పంచుతానని ఎన్నో వాగ్దానాలు చేసి వాటిని పూర్తిగా విస్మరించారన్నారు. కరోనాకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న సందర్భంలో పెట్టుబడుదారుల ఆస్తులు వేల కోట్లకు ఎలా పెరిగాయని ఆవేదన వ్యక్తపరిచారు. ఎందరో ప్రాణత్యగారు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించారని వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలన్నారు. కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించి కనీస పెన్షన్ 10000 గా ఉండాలన్నారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి వీరందరినీ రెగ్యులర్ చేయాలన్నారు.సమగ్ర చట్టం చేయాలని ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి దినసరి వేతనం రూ.800 ఉండేటట్లుగా చూడాలన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు మరియు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే బషీర్, వెంకన్న,రేపల్లి వెంకటేశ్వర్లు కేతపల్లి సైదులు, రెడ్డిమల్ల సురేష్, వెంకటయ్య, కేశన్ యాదయ్య,సైదిరెడ్డి,పేరూరు శ్రీను సహదేవుడు వెంకన్న తదితరులు ఉన్నారు.