పెండింగ్ జీతాలు చెల్లించాలి: సీఐటీయూ

నవతెలంగాణ – బొమ్మలరామారం
అఖిల భారత కమిటీ పిలుపు మేరకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం  తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ అందించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం)పార్టీ మండల కార్యదర్శి  ర్యకలశ్రీశైలం మాటడుతూ… కేంద్ర బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలంటే పోరాటాలను తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు, వారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ పంచాయతీల ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు సిద్ధంకి యాదగిరి, ఉపాధ్యక్షులు కొండమడుగు బాలయ్య కోశాధికారి సాయిలు శ్రీపతి బాలరాజ్ కార్మిక సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో తుడు మల్లేష్ గుండె అండమ్మ పద్మ నరసమ్మ లక్ష్మి కాంత్ మైలారం జాంగిరి తదితరులు పాల్గొన్నారు.