– జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు లు అన్నారు. బుధవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మాట్లాడారు. గ్రామపంచాయతీ సిబ్బందికి బకాయిగా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులందరిని పర్మనెంట్ చేయాలని వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కారోబార్ బిల్ కలెక్టర్ ను సహాయ కార్యదర్శిగా నియమించాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరీలు అన్నింటిని యధావిధిగా కొనసాగించాలని, ఇన్సూరెన్స్ బీమా సౌకర్యాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన కార్మికులను తీసుకోవాలని ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలని కార్మిక భీమా సౌకర్యాలు కల్పించాలని గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని నా పంచాయతీలలో వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కామిటి సభ్యులు ఎం మదు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ఈశ్వర్, అధ్యక్షులు బందెల భిక్షం, మంద యాదగిరి, రమేష్, బాల మల్లయ్య, పరమేశు, ఎల్లమయ్య, యాదగిరి, సామి, నరసింహ, వెంకటేశం, పాపయ్య, శంకర్ , అనిత, బుజ్జమ్మ, మైసమ్మ, లక్ష్మి, జయమ్మ, మైసమ్మ, అనిత, శోభ , లక్ష్మి లు పాల్గొన్నారు.