గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని: సీఐటీయూ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల వేతనాలు గత 10 నెలల నుంచి ఇవ్వకపోవడం వలన అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఏర్పడిందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. చౌటుప్పల్ ఎంపీడీవో గారికి గతంలో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించిన స్పందనలేదని త్రివ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశామని ఆదిమూలం నందీశ్వర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల ప్రతి నెల వేతనాలు చెల్లించాలని,పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికులతో కలసి చిన్న కొండూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు .ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, మాజీ ఎంపిటిసి ఎలకరాజు యాదగిరి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షు లు మాండ్ర శీను సిబ్బంది ప్రమీల,కిష్టయ్య,మారమ్మ ,చెక్క కిష్టయ్య,రమేష్,పరమేష్,పోచమ్మ,అండాలు ,సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.