సమస్యల పరిష్కారానికి ఒత్తిడి పెంచుతాం : సీఐటీయూ

 Adilabadనవతెలంగాణ-మందమర్రి
సింగరేణిలో కార్మికులు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘంపై ఒత్తిడి పెంచుతామనిసింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మేండే శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం కెకె-5 గనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ గెలిచిన సంఘంకు గుర్తింపు పత్రం ఇవ్వడానికి పోరాటం చేశామని, అదేవిధంగా వారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్ని రెండు సంవత్సరాల కాల పరిమితిలో అమలు చేయించేలా ఒత్తిడి తెస్తూ ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వర్థిస్తామని అన్నారు. లాభాల వాటా విషయంలో కార్మికుల మన్ననలు పొందలేకపోయారని పోరాటాల సంఘమని గెలిపిస్తే అధికారం ఎక్కువ రోజులు కావాలని ఆలస్యం చేశారని గుర్తింపు పత్రం వచ్చినందున ఇప్పటికైనా స్ట్రక్చర్‌ సమావేశాల కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి మొదటి సమావేశంలోనే అలవెన్స్‌లపై ఐటి మాఫీ, సొంతింటి కల, మారు పేర్లు అంశాలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గనులపై విడుదల చేసిన లాభాల కరపత్రానికి అసలు లాభాలకు తేడాలు ఉన్నందున సరిచూసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు తప్పుడు లాభాలు ప్రకటిస్తున్నారని శ్వేత పత్రాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేసి తీరా గెలిచాక శ్వేత పత్రాలు అడగడమే తప్పు అన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ అధ్యక్షుడు ఎస్‌ వెంకటస్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్‌, పిట్‌ సెక్రటరీ సంకె వెంకటేష్‌, అసిస్టెంట్‌ ఫిట్‌ సెక్రటరీ చీకటి వంశీ, దొండ నవీన్‌, ఆదర్శ్‌, చైతన్యరెడ్డి, రాంబాబు, సీనియర్‌ నాయకులు అలవల సంజీవ్‌ పాల్గొన్నారు.