సీపీఎస్‌యూ పరిరక్షణోద్యమం ఉధృతం చేస్తాం : సీఐటీయూ

సీపీఎస్‌యూ పరిరక్షణోద్యమం ఉధృతం చేస్తాం : సీఐటీయూనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఎస్‌యూల పరిరక్షణోద్యమాన్ని రాష్ట్రంలో ముమ్మరం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీడీఈయూ (సిఐటియు అనుబంధం) అధ్యక్షులు ఎ. బాపూరావు అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల సమావేశం జరిగింది. అందులో జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ..2023 ఆగస్ట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఆయిల్‌ సెక్టార్‌తో ఏడు ప్రభుత్వరంగ సంస్ధలను ప్రయివేటీకరించేందుకు నిర్ణయించిందనీ, ఈ చర్యలకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించడం చారిత్రక అవసరమని చెప్పారు. అందులో సీఐటీయూ చొరవ కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంమ్‌డీ అబ్బాస్‌, ఎ.యాదగిరి, టి.సత్తయ్య, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.