– పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కే.మాధవరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
చేవెళ్ల ఎంపీగా కొండ విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపునకు కృషి చేసిన వారికి ఈ నెల 19న కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్‌లో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కె.మాధవరెడ్డి తెలి పారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో పదాధికా రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నిర్వహించే పౌ ర సన్మానం కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ భాస్క ర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, పాండుగౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శిరీష, రాములు, సతీష్, వికారాబాద్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ వడ్ల నందు, ఎంపీటీసీ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు మదన్‌పల్లి రాజు, తలారి రాజు, తదితరులు పాల్గొన్నారు.