పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి టీఎస్పీ భార్గవి తెలిపారు. శనివారం బాన్సువాడ కోర్టులో జాతీయ న్యాయ సేవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ దినోత్సవం పురస్కరించుకొని ప్రజలకు సత్వర న్యాయం కలిగేలా చూడాలని, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బారాసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు రమాకాంత్, భూషణ్ రెడ్డి, మోహన్ రెడ్డి, దత్తాత్రేయ, ఖలీల్, మొగులయ్య, కోర్టు సిబ్బంది శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.