
శంకరపట్నం మండల పరిధిలోని వంకాయ గూడెం గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శంకరపట్నం మండల ఎంపీడీవో శ్రీవాణి హాజరై మాట్లాడారు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతిని మానుకోవాలని అలాగే దేవాలయాల్లో పాఠశాలల్లో అందరికీ కుల మత బేధం లేకుండా ఒకే విధానంగా విద్యను అభ్యసించే విధంగా ఉండాలని అలాగే దళితుల పట్ల చిన్న చూపు చూడడం వారిని కులం పేరుతో కించపరచడం ఇలాంటివి మానుకోవాలన్నారు. పేదరికం నిర్మూలన కావాలంటే విద్యతోనే రూపుమాపాలని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి గొప్ప విద్యావంతులు కావాలని అలాగే మీ గ్రామంలో ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని తీసుకువస్తే సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామన్నారు.ఈ కార్యక్రమంలొ ఆర్ఐ లక్ష్మారెడ్డి, ఎస్సై మల్లారెడ్డి,వివిధ శాఖల అధికారులు, బూర్ల మొగిలి,ఆశ వర్కర్లు, అంబేద్కర్ సంఘం మండల నాయకులు , గ్రామ అంగన్వాడి టీచర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.