పౌర హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

Civil rights should be exercised by everyoneనవతెలంగాణ – వీర్నపల్లి 
రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఉప తహశీల్దార్ ప్రవీణ్ కుమార్  అన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి  గ్రామ పంచాయితీ కార్యాలయంలో  పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఎక్కడైనా పౌరహక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివక్ష లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్ ఐ ప్రవీణ్ కుమార్, కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, సుతారి కార్మిక సంఘం నాయకులు రాజెల్లయ్య , గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.