మండల కేంద్రంలోని స్లేట్ హై స్కూల్, స్లేట్ ఎక్సలెన్స్ స్కూల్‌లలో సోమవారం ఆ పాఠశాల విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రముఖ పండితుడు విద్యావేత్త నారోజు శంకర్ చారి, విద్యార్థులకు సివిల్ సర్వీసులలో రాణించడానికి కావలసిన విలువైన సమాచారాన్ని అందించారు. రేపటి పౌరులకు నాయకత్వ లక్షణాలను అందించడంలో సంస్థ ధృడ నిబద్ధతను పునరుద్ఘాటించారు. విద్యార్థులను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో, ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకు సాగాలో వివరించారు. క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం, మరియు దేశ సేవ పట్ల ఆసక్తిని పెంపొందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి ప్రిన్సిపాల్ షిరిన్ ఖాన్, ష్యామ్ లాల్ విద్యార్థులు పాల్గొన్నారు.