నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సివిల్స్-2023లో ఆల్ ఇండియా స్థాయిలో196వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. పట్టుదలతో చదివి సివిల్స్ టాపర్‌గా నిలవడం పట్ల సీఎం ఈ సందర్భంగా అక్షరును అభినందించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన అక్షయ్ బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ చేశారు. క్యాంపస్ ఇంటర్వూలోనే దుబాయిలోని కంపెనీలో రూ.40 లక్షల ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు.