రాజన్న కోడెలపై స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వండి..

Local MLA clarify on Rajanna Kode..– డైవర్టు రాజకీయాలు మానుకొని  అభివృద్ధికి స్వాగతం పలకండి..
– వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబొం..
– కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది..
నవతెలంగాణ – వేములవాడ
రాజన్న కోడల పై స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని, డైవర్టు రాజకీయాలు మానుకొని అభివృద్ధికి స్వాగతం పలకాలని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్  మాట్లాడుతూ.. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అత్యంత ప్రీతికరమైన మొక్కు కోడెమొక్కు ..ఏటా కోడే మొక్కుతో కోట్ల రూపాయలలో రాజన్నకు ఆదాయం వస్తున్న .. కానీ ఆదాయం తీసుకువచ్చే కోడెకు మాత్రం రక్షణ కరువైంది మండిపడ్డారు.  రాజన్న కోడెల విషయం పక్కనబెట్టి వ్యక్తిగత విషయాలు తీస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని, మంత్రి కొండా సురేఖ సిఫారసు చేసిన కోడెల పంపిణీ సక్రమమా… అక్రమమా మీరే తేల్చి చెప్పండి అని ప్రశ్నించారు. ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే నీపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోగా.. మా నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తూ.. నిన్నటి రోజున రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి  కోడెల మృతిపై శాంతి హోమం జరుపగా ఆ విషయాన్ని డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే సీఎం సభలో భోజనాల పేరిట ప్లేటుకు 32వేల చొప్పున బిల్లులు వేసి రాజన్న ఈవో కి పంపిన విషయం నిజం కాదా.. మూడో విడత కోడెల పంపిణీ జిల్లా కలెక్టర్ కు తెలియకుండా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించింది నిజం కాదా అని ప్రశ్నించారు.దీనిపై కలెక్టర్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన నిజం కాదని అన్నారు.తెలంగాణలోనే శైవ క్షేత్రంగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టార్ హోటల్ గా మార్చిన ఘనత మీకే దక్కిందన్నారు. మీరు చేసిన పాపాలు పోవాలంటే రాజన్న ఆలయ ధర్మగుండంలో నిండా మునిగి తడి బట్టలతో రాజన్న ముందు పొర్లుదండాలు పెట్టి మమ్మల్ని క్షమించు రాజన్న అని వేడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాం అని తెలిపారు. అనంతరం పోతూ అనిల్ కుమార్ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆనాడు ఏ పార్టీలో ఉన్నారో ఆ ప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏం మాట్లాడారో మాకు తెలుసుని అన్నారు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.. ఇక్కడ ఉంటే ఈ పాట…. అక్కడ ఉంటే ఆ పాట పాడితే వ్యక్తిగతంగా మీరే ప్రజలకు దూరం అవుతారు, అది గుర్తుంచుకోవాల అని తెలిపారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు లిక్కిడి మహేందర్, వాసాల శ్రీనివాస్, సుంకపాక రాజు, ఎస్.కె పర్వేజ్, మంతే సందీప్, దురిశెట్టి ప్రేమ్ చారి, బూర రాజశేఖర్, ఎండి రఫిక్, వెంకట సాయి, తీగల హరీష్, చీటి సంధ్యారాణి, రాకేష్, తో పాటు తదితరులు ఉన్నారు.