నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రంలోని ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణలో ఒకరికి చెయ్యి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల లో సాలూరు మండల కేంద్రానికి చెందిన ఎం. గణేష్ అనే విద్యార్థి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్ భవనం పైకి మరో విద్యార్థి తో జరిగిన ఘర్షణలో చేతి తీవ్ర గాయమై విరిగినట్టు తండ్రి లాలయ్య శనివారం తెలిపారు. ఇట్టి విషయమై పాఠశాల వార్డెన్ ను అడగగా.. సీసీ ఫుటేజ్ పరిశీలన ఆధారంగా ఆ విద్యార్థికి టీ సీ ఇచ్చి పంపిస్తామని చెప్పినట్టు తెలిపారు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణలో మరొక విద్యార్థి సైతం ఇద్దరినీ ఆపినట్టు తెలిపారు.