
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పుష్కర దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పిండి వంటలను తయారు చేసి గంగమ్మ తల్లికి తే ప్పలను విడిచారు. దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు వంటలు చేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పురాతన రామాలయం వెళ్లి దర్శించుకున్నారు.