
పుస్తకాలతో పాటు సమాధానం చదవాలి అని ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్ తెలిపారు శనివారం స్థానిక సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో చాలా రకాలైన మనుషులు ఉంటారు. అంతే కాకుండా మార్చ్ 18వ తారీకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. కాబట్టి కష్టపడి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు. ప్రధాన వక్త సంగరాజు శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఈ పరీక్ష సమయంలో దాదాపు 7 గంటలు నిద్ర, 14 గంటలు చదవడానికి సమయాన్ని కేటాయించాలని విద్యార్థులకు తెలిపారు. సెల్ఫోన్ ను తక్కువ ఉపయోగించి తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, దేశం పట్ల గౌరవం ఉండాలని అలా ఉన్నప్పుడు మనం ఎదైన సాధిస్తాం అని తెలిపారు. విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి మాట్లాడుతూ జీవితం చాలా విలువైనదని అలాంటి దానిలో ఈ మధ్యలో కొంత మంది స్ట్రెస్ కు గురి అవుతున్నారు కాబట్టి ఎలాంటి సమస్యలైన కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అనేది ఉంటుందని తెలిపారు. కాబట్టి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి కానీ ఆత్మహత్యల వైపు వెళ్ళవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూరో కిడ్జ్ ప్లే స్కూల్ కరపత్రమును విడుదల చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పగిడాల పురేంధర్ రెడ్డి, డి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ అపర్ణ, స్వాతి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.