వచ్చే నెల మూడు నుంచి పదో తరగతి పరీక్షలు

– పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే నెల మూడు నుంచి నిర్వ హించనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శనివారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఈ నెల 24 నుంచి ఆన్‌ లైన్‌లో అందుబాటులో ఉంచటమే గాక, పాఠశాలలకు కూడా పంపుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారనీ, ఇందు కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.