విద్యార్థి జీవితంలో పదో తరగతి మైలురాయి

– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక విద్యార్థులకు సన్మానం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి విద్యార్థినీ, విద్యార్థుల జీవితంలో పదవ తరగతి మైలురాయి వంటిందని, విద్యార్థులు సాధించిన విజయంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కా రాలు 2024 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శశాంక ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 50 వేల 807 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసినట్టు తెలిపారు. అందులో 46 వేల 245 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 36 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని, 10/10 గ్రేడ్‌ పాయింట్స్‌ను 50 మంది విద్యార్థులు సాధించినట్టు తెలిపారు. 82.22 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10/10 గ్రేడ్‌ పా యింట్స్‌ను సాధిం చిన విద్యార్థుల సంఖ్య పెరిగిందని, వంద శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూ ల్స్‌ సంఖ్య పెరిగిందన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాభినందనలు తెలియ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్‌ కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైందని, విద్యార్థుల జీవితానికి మనం ఒక రూపాన్ని ఇచ్చుకోగలుగుతున్నామని అన్నారు. మనం ఎక్కడ పుడతామో, ఎక్కడ పేరుగుతామో మన చేతులలో ఉండదు, మనం ఏ స్థాయికి చేరుకోవాలనేది మాత్రం కచ్ఛితంగా మన చేతులోనే ఉంటుంద ని తెలిపారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, గమ్యాన్ని నిర్దేశించుకొని ఇష్టంతో, కష్టపడి, కసిగా చేసినప్పుడు కచ్ఛితంగా విజయం సాధిస్తామ న్నారు. మీరు మీ కుటుంబానికి ఎంత అయితే గౌరవాన్ని తీసుకురా గలిగారో, ముందు ముందు మీరు సాధించే విజయాన్ని మీ వాడకు, మీ ఊరికి, మీ ప్రాంతానికి, మీ మొత్తం బంధుగణానికి గొప్ప గౌరవాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, మేరు ఏ రంగంలో ఉన్న పదవ తరగతిలో 10/10 సాధించిన విధంగానే అ రంగంలో గొప్పగా విజయం సాధించాలన్నారు. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంతో కష్టపడితేనే విజయం సాధిస్తారని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్‌, భూపాల్‌ రెడ్డి మాట్లాడారు.. 10/10 సాధించిన విద్యార్థినిలు తమ పాఠశాలలో చక్కటి ప్రణాళికతో, అర్ధమయ్యే విధంగా బోధన చేయడం అత్యుత్తమ మార్కుల సాధనకు దోహదపడిందని తమ అభిప్రాయాలను ఈ సందర్బంగా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి సుశీం దర్‌ రావు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, సబ్జెక్టు రిసోర్స్‌ ఉపాధ్యాయులు, కోఆర్డినేషన్‌ టీం, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.