
నవతెలంగాణ -డిచ్ పల్లి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెగ్యులరైజేషన్ పత్రాలను అందజేశారు. గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిచ్ పల్లి మండలానికి చెందిన 24 మంది జేపీఎస్ లకు, ఇందల్ వాయి మండలంలోని 9మంది జెపిఎస్ లకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెగ్యులరైజేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్తాయిలో కార్యదర్శులు విశేషంగా కృషి చేయడం మూలంగానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యదర్శులు చేసిన కృషితోనే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు సాధించినట్లు తెలిపారు. ఇలాగే భవిష్యత్తులో మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీవో జయసుధ, డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో గోపిబాబు, రాములు నాయక్, ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, రాజ్ కాంత్ రావు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిర లక్ష్మినర్సయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి,సినియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.