ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు

– ఓకే గదిలో 3 తరగతుల నిర్వహణ.

నవతెలంగాణ- అచ్చంపేట : లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తరగతిలో లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే గదిలో మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారులు పాలకులు అదనపు గదులు నిర్మాణం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థిలు, వారి తల్లిదండ్రులు,  గ్రామస్తులు మండిపడుతున్నారు. ఒకటి నుంచి ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 ,2, 3  తరగతులను ఒక గదిలో, 4,5, 6, తరగతులను మరొక గదిలో సబ్జెక్టులు బోధించడంలో  ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు ప్రవరీ కూడా లేకపోవడంతో విద్యార్థులకు భద్రత కరువైంది.  ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని గ్రామపంచాయతీ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని ఆక్రమించుకున్నారని పాఠశాల హెడ్మాస్టర్ శ్రీను తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆశ్రమ పాఠశాల స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.