దీపావళికి మట్టి దివ్వెలు వాడాలి

Clay lamp should be used for Diwali– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

పట్టణ ప్రజలందరూ దీపావళి పండుగ సందర్భంగా దీపాలు వెలిగించుటకు మట్టి దివ్వెలు వాడాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. మంగళవారం  హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ దీవాలి శుభ్ దీవాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీపావళి వేడుకలలో బాణసంచాను తక్కువగా ఉపయోగించి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ అనిత రెడ్డి ,కౌన్సిలర్స్ నళిని దేవి , స్వర్ణలత , భాగ్య రెడ్డి , పద్మ , సరోజన , సుప్రజ, పర్యావరణ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.